పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకునే ప్రేమ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తున్న ఈ తరం దంపతుల పోకడ పాతతరం వారికి ఆందోళనకు కారణమవుతోంది. అదేసమయంలో కొందరు మహిళలు పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కూడా పెళ్లి పెటాకులవడానికి ఓ కారణంగా ఉంది.
ఈ క్రమంలో తాజాగా కొందరు మహిళలు భర్త ఉండగా, పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికిగల కారణాలను ఇక్కడ తెలుసుకుందాం. దంపతుల్లో చాలామందికి ఇతరులతో తమ జీవిత భాగస్వామిని పోల్చి చూసుకునే బలహీనత ఉంటుంది. తాను ఆశించినట్టు భర్త లేడనో, సంసార సుఖం విషయాన్ని పట్టించుకోవడం లేదనో అసంతృప్తికి లోనవుతుంటారు. ఈ అసంతృప్తిలో వివాహేతర సంబంధాల ఉచ్చులో పడుతుంటారు.
విషయం బయటపడ్డాక కాపురాలు కూలుతుండటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వివాహేతర సంబంధాలు విభేదాలకు కారణమై చివరికి విడాకుల వరకు వెళ్తున్నాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారిలోనూ ఈ సమస్య ఉండటం, అదీ పెళ్లయ్యాక గోల్డెన్ పీరియడ్‌గా చెప్పుకునే మూడేళ్లలోపే ఈ సమస్యలు రావడం గమనార్హం.