రైతుబిడ్డకి గర్వం తలకెక్కిందా? అప్పట్లో బతిమిలాడి..! ఎప్పుడు ఎలా చేసాడో తెలుసా..?

పల్లవి ప్రశాంత్-అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య షో ప్రారంభం నుండి వివాదం నడుస్తోంది. సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు. అమర్ దీప్ తన కొడుకును తక్కువ చేసి చూస్తున్నాడని పల్లవి ప్రశాంత్ తండ్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తిడుతున్నారని అమర్ దీప్ తల్లి ఫైర్ అయ్యింది. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు యూట్యూబ్ ఛాన్సల్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చి.. తనను సపోర్ట్ చేయండని బతిమాలాడిన ప్రశాంత్.

బయటకు రాగానే ఇంటర్వ్యూ అడిగితే.. ‘ఇప్పుడు నేనివ్వను, నేను నిద్ర పోవాలి’అంటూ పిచ్చి పిచ్చి కారణాలు చెబుతున్నారు. ఇంటర్వ్యూ ఇస్తానని పర్మిషన్ తీసుకున్నాకే.. అతడి ఇంటి వద్దకు వచ్చిన మీడియాను సైతం 18 గంటల పాటు వెయిట్ చేయించాడు. ఆ తర్వాతైనా ఇస్తాడా అంటే అదీ లేదు. ఒక్క 10 నిమిషాల ఇంటర్వ్యూ అడిగినా కూడా చాలా దురుసుగా సమాధానం చెబుతున్నాడని యూట్యూబర్స్ చెబుతున్నారు. మీరు రైతుుకు ఏమిస్తారో చెప్పుర్రి అంటూ మీడియాను ప్రశ్నలు వేశాడు.

మరీ నువ్వేం చేసినవ్ అని అడిగితే.. నేనేమన్నా సీఎంనా అంటూ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నాడని పేర్కొంటున్నారు. ఈ ప్రవర్తన పట్ల బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యాంకర్ శివ తప్పుపట్టాడు. ‘ప్రశాంత్.. 18 గంటల పాటు వెయిట్ చేయించి.. ఇంటికి రా అన్న ఇంటర్వ్యూ ఇస్తా అని పిలిచారు. అక్కడికి వెళ్లి 8 గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వను, ఇక్కడ నుండి వెళ్లిపోండి అని రెక్లెస్‌గా సమాధానం చెప్పాడు. ఒక గొప్ప విన్నర్’అంటూ కామెంట్ చేశాడు శివ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *