రవితేజ ప్రస్తుతం ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వర రావు’, ‘ధమాకా’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే తన ఈజీ నటనతో, క్యాచీ డైలాగ్స్‌తో కట్టిపడేస్తుంటారు రవితేజ. సినిమా సినిమాకు ట్రాన్ఫర్మేషన్ అవుతూ.. కొత్తగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. అలాగే ఎంతటి రిస్క్ చేసేందుకు కూడా వెనకాడడు.
తాజాగా ఆయన టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్న సంగతి విదితమే. సువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. రవితేజకు జరిగిన ప్రమాదం గురించి వెల్లడించారు నిర్మాత అభిషేక్. ‘ఈ సినిమాలోట్రైన్ దోపిడీ సీన్ చేసేటప్పుడు.. రైలు మీద నుండి లోపలికి దూకే షాట్ ఉంటుంది. ఆ షాట్ లో రవితేజ అదుపు తప్పి కింద పడ్డారు. మోకాలికి కొద్దిగా పైన దెబ్బ తగిలింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆపరేషన్ చేసి 12 కుట్లు వేశారు‘ అని చెప్పారు. ‘ఆ షాట్‌లో 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు.
షూట్ వాయిదా వేస్తే నిర్మాతకు నష్టం వస్తుందని భావించి రెండు రోజుల్లోనే షూటింగ్‌కు వచ్చేశారు. రెస్టు తీసుకోమని చెప్పినా.. నిర్మాతకు నష్టం రాకూడదన్న కారణంతో నొప్పిని భరిస్తూ.. షూటింగ్‌లో పాల్లొన్నారు’ అని వెల్లడించారు. కాగా, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా ఈ నెల 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ పొందింది. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందిస్తున్నారు.