తన అందంతో.. తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో తమిళ్ సీరియల్స్‌లో రాణిస్తున్న మహాలక్ష్మీ.. అప్పటికే తన భర్తకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నారు. ఓ పక్క తన కెరీర్లో తాను బిజీగా ఉంటూనే.. సీరియల్ ప్రొడ్యూసర్ రవీందర్ తో ప్రేమలో పడ్డారు. రవీందర్ భారీగా ఉన్నా కూడా… ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తన ఊభకాయంపై.. వారి ప్రేమ వివాహం పై దారుణ కామెంట్స్ చేసినా.. సైలెంట్‌గా ఉన్నారు.
అవేమీ పట్టించుకోకుండా.. రవీందర్తోనే.. హ్యాపీగా తన సెకండ్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చారు. అయితే అలాగే నా భర్త రవీందర్ బరువు ఎక్కువ ఉండటంతో.. ఇక నేనే ఆయన కోసం బరువు పెరగాలని నిర్ణయించుకున్నాను. రవీందర్ బరువు తగ్గాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేదు. కాబట్టి నేనే ఆయన మాదిరిగా బరువు పెరగాలని ప్లాన్ చేస్తున్నా. ఈ క్రమంలోనే.. నేను బరువు పెరిగెందుకు అధికంగా కొవ్వు పదార్థలను కూడా తీసుకుంటున్నాను.

అందుకోసం.. అర్ధరాత్రి సమయంలో నేను ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నాను. ఆ సమయంలో నాకు నిద్ర కూడా పోతుంది. ఎలాగైనా నేను కూడా ఆయనలా మారాలి. అప్పుడైనా ఈ ట్రోల్స్ ఆగిపోతాయి అనుకుంటా. రవీందర్ జుట్టు నెరిసిపోవడం చాలా బాధగా ఉందని అన్నారు’’ అని అన్నారు.