యాంకర్ రష్మి క్రేజ్ మామూలు కాదు. ఆమె జబర్దస్త్ యాంకర్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. బుల్లితెరని ఊపేస్తుంది. పదేళ్లుగా అంత్యంత విజయవంతంగా రాణిస్తుంది. ఆ క్రేజ్‌కి కారణం ఆమె అందంతోపాటు అభినయం కూడా అని చెప్పొచ్చు. రష్మి, సుడిగాలి సుధీర్ మధ్య చాలం మంచి బాండింగ్ ఏర్పడింది. స్టేజ్ పై లవర్స్ గా చెలామణి అయ్యారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.
అది జబర్దస్త్ షోకి టీఆర్‌పీ రేటింగ్ తేవడంలో సక్సెస్ అయ్యింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆల్మోస్ట్ ఏడాదిన్నరగా ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. సుధీర్ జబర్దస్త్ మానేయడంతో ఆ గ్యాప్ వచ్చింది. ఆయన హీరోగా బిజీగా ఉన్నాడు. రష్మి బుల్లి తెరపై రచ్చ చేస్తూనే ఉంది. అవకాశాలు వస్తే వెండితెరపై కూడా మెరుస్తుంది.
ఇదిలా ఉంటే చాలా కాలంగా సుధీర్, రష్మి కలిసి లేకపోవడంతో ఈ ఇద్దరి అభిమానులు ఫీల్ అవుతున్నారు. నిరాశ చెందుతున్నారు. ఇద్దరు కలవాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో టీవీ షోస్‌లోనూ ఆ వెలితి కనిపిస్తుందంటూ తరచూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ సుధీర్ రావాలని కోరుకుంటున్నారు. కానీ ఒంటరిగానే జబర్దస్త్ ని డీల్ చేస్తుంది రష్మి. తనవంతుగా అలరించే ప్రయత్నం చేస్తుంది.