ఇప్పటికే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన క్రతువులు మొదలయ్యాయి. గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని పెట్టారు. జనవరి 20, సరయూ పవిత్ర నదీ జలాలతో ఆలయ గర్భగుడిని పరిశుభ్రం చేస్తారు. రేపు 125 కలశాలతో వివిధ పుణ్య క్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో రామ్ లల్లాకి దివ్య స్నానం చేయిస్తారు.
జనవరి 22 మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగనుంది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకని కనులారా వీక్షించాలని అందరూ ఆశ పడతారు కానీ అది సాధ్యపడదు. కానీ అయోధ్య వెళ్ళకుండానే అయోధ్య రాముడి ఆశీస్సులు మీరు పొందవచ్చు.
ఇప్పటికే అందరికీ రామాలయానికి సంబంధించిన అక్షితలు అందరి ఇళ్లకి చేరుకున్నాయి. అయోధ్య వెళ్లకుండానే ఇంట్లో రాముని విగ్రహానికి ఇలా పూజ చేయడం చేసుకోవచ్చు. ఈ పూజా విధానం అనుసరిస్తే అయోధ్య రాముని అనుగ్రహం పొందుతారు.