ఎవరీ శ్రావ్య..? కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భార్య ఎవరి కూతురో తెలుసా..?

కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా గెలుపొంది… మోదీ 3.0 కేబినెట్‌లో పదవి దక్కించుకున్నారు. కేంద్ర మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విమానా యాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన 16 మంది ఎంపీల్లో రామ్మోహన్‌ నాయుడు సీనియర్‌. అయితే 2017 వ సంవత్సరం జూన్ నెలలో శ్రావ్య గారితో రామ్మోహన్ నాయుడు గారికి పెళ్లి అయింది. అయితే శ్రావ్య గారు ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి, వారిది ప్రేమ పెళ్ళా అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. అయితే రామ్మోహన్ నాయుడు గారి పెళ్లి అనుకోకుండా శ్రావ్య గారితోనే కుదిరింది.

రామ్మోహన్ నాయుడు గారు బండారు అప్పల నాయుడు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్,, ఒకే కాలేజీలో చదువుకున్నారు కూడా ఆ బండారు అప్పల నాయుడు ఎవరో కాదు, టిడిపి సీనియర్ నేత ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి గారి కొడుకే, స్నేహితుడే కాబట్టి రామ్మోహన్ నాయుడు గారి గురించి అన్ని విషయాల క్షణం గా తెలుసు కాబట్టి తన సోదరికి పెళ్లి సంబంధాలు చూసిన శ్రమను తగ్గించింది. ఆల్రెడీ అప్పటికే రాజకీయంలోకి ఇచ్చి ఎంపీ గా గెలిచిన రామ్మోహన్ నాయుడుకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచన అప్పల్ నాయుడుకి వచ్చింది. దీంతో ఇదే విషయాన్ని తండ్రితో చెప్పి ఇంట్లో చెప్పి ఒప్పించారు. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడాడు. పెళ్లి కోసం అంటూ కాదు గాని ఓసారి పర్సనల్ గా మా చెల్లెమ్మను కలువు మాట్లాడు నీకు నచ్చితేనే ప్రొసీడ్ అవుదాము. అంటూ చెప్పేసరికి రామ్మోహన్ నాయుడు గారు సరే అని అన్నారు.

ఆ తర్వాత శ్రావ్యతో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసి మాట్లాడారు. ఇద్దరి మనసులు కలిసాయి. దీంతో ఇరు కుటుంబాలు కూడా ప్రొసీడ్ అయ్యాయి. మొత్తానికి ఓ టీడిపి సీనియర్ నేతకు చెందిన కొడుకు మరో టీడిపి సీనియర్ నేతకు చెందిన కూతురికి 2017 వ సంవత్సరం జూన్ నెలలో టీడిపి అధికారంలో ఉన్న సమయంలోనే పెళ్లి జరగడంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ నేతలంతా ఆ పెళ్లిలోనే తెగ హంగామా చేశారు. అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిగింది ఏడేళ్ల వారి వైవాహిక జీవితానికి తీపి గుర్తుగా ఓ కూతురు కూడా వారికి జన్మించింది. ఓవైపు ఫ్యామిలీ మరోవైపు పార్టీ ఇంకోవైపు ఎంపీ గా విధులు ఇలా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న రామ్మోహన్ నాయుడు గారికి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ప్రమోషన్ లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *