ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విస్పోటనం జరిగే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్‌ను స్వాగతించేందుకు భారీగా వచ్చారు. అయితే పవన్ సభకు వందల్లో వచ్చారని దుష్ప్రచారం చేసిన మీడియా ఛానెల్స్ తీరును పృథ్వీ తప్పుపట్టారు. పవన్ కల్యాణ్ క్రేజ్‌ను తగ్గించేందుకు కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా ప్రజలు సోషల్ మీడియా ద్వారా గ్రహిస్తున్నారు అని పృథ్వీ చెప్పారు. గత ఎన్నికల విజయాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ నేతలు వై నాట్ 175 అని మురిసిపోతున్నారని..
ఈసారి ఎన్నికల్లో 175 సీట్లు రావని 17 మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎలక్షన్ తర్వాత సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్లతో పాటు అంబటి రాంబాబుని కూడా పిలవచ్చని.. లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వచ్చని దెప్పిపొడిశారు. వీళ్ల నోటి నుంచి ఎప్పుడు పవన్ కళ్యాణ్‌కు మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓడిపోయాడని అంటారన్నారు.పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ఆగిపోయిందా? రెండు చోట్ల ఓడిపోవడం వల్ల అమలాపురం రోడ్ల అభివృద్ధి ఆగిపోయిందా? అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తే ఎయిర్ పోర్టులో జనసేన కార్యకర్తలకు మధ్యవేలు చూపించిన రోజాను జనసేన కార్యకర్తలు అసలు వదిలిపెట్టరని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ కూటమి 136 అసెంబ్లీ స్థానాల్లోనూ, 21 ఎంపీ స్థానంలోనూ ఘన విజయం సాధిస్తుందని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.