హీరోయిన్గా కెరీర్ ముగిసిపోయిన సమయంలో వచ్చిన ఫ్యామిలీమ్యాన్ వెబ్‌సిరీస్ ఆమెకు బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో వరుస హిట్స్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లోనూ మంచి పేరే తెచ్చుకుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రియమణి ఒకరు.
ప్రియమణి రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు.
ఇటీవల భామకలాపం 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రియమణి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.