త్రివిక్రమ్ మాటలు నమ్మి సినిమా చేసినందుకు నా కెరీర్ నాశనమైంది. చిరునవ్వుతో మూవీ తర్వాత నాకు అలాంటి పాత్రలే వచ్చాయి. హీరోయిన్ గా అప్పుడే ఎదుగుతున్న నా కెరీర్ దెబ్బతిందని ప్రేమ వెల్లడించారు. అయితే హీరో వేణు నటించిన చిరునవ్వుతో సినిమాలో ప్రేమ కీలక పాత్రలో నటించింది. బావతో పెళ్లి వద్దనుకుని ఒక మోసగాడితో వెళ్లిపోయిన పాత్రలో ప్రేమ నటన అందరినీ అలరించింది. ఈ మూవీలో ప్రేమది సపోర్టింగ్ క్యారెక్టర్. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించారు. ఈ పాత్రలో నటించేందుకు మొదట ప్రేమ ఆసక్తి చూపలేదట. కానీ త్రివిక్రమ్ తనది హీరోయిన్‌తో సమానమైన పాత్ర అని ప్రేమని ఒప్పించారట.
త్రివిక్రమ్ మాటలను అంతగా నమ్మకపోయినా అనుమానంతో సినిమాకు ఓకే చెప్పారట ప్రేమ. తర్వాత సహాయ పాత్ర అని తెలిసినా.. ఇక మాట ఇచ్చానని నటించక తప్పలేదట. షూటింగ్‌కి ముందు ఒకలా చెప్పి సినిమాలో తన పాత్రను మరోలా చేశారని అన్నారు. ఈ మూవీ తర్వాత కూడా తనకు అన్ని సపోర్టింగ్ రోల్సే వచ్చాయని ప్రేమ చెప్పారు. వాటికి నో చెప్పడంతో ఆ తర్వాత అవకాశాలే రాలేదన్నారు. కీలక దశలో ఉన్న తన కెరీర్ ఈ ఒక్క నిర్ణయం వల్ల నాశనం అయిందని ప్రేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ నాశనమవ్వడానికి ఒక రకంగా త్రివిక్రమ్ కారణమని ప్రేమ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని ఇండస్ట్రీలో టాక్.
ప్రేమ కెరీర్‌లో దేవి మూవీ ది బెస్ట్ సినిమా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రేమ నాగదేవతగా నటించారు. ఈ మూవీతో ప్రేమ టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇంతలోనే సపోర్టింగ్ రోల్ చేయడంతో ఇక అలాంటి పాత్రలే వచ్చాయి. ఆ తర్వాత అవి కూడా తక్కువై క్రమంగా ప్రేమ తెలుగు వెండితెరపై కనుమరుగయ్యారు. ప్రేమ తెలుగులో ధర్మ చక్రం చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. దేవి పుత్రుడు, రాయలసీమ రామన్న చౌదరి లాంటి చిత్రాల్లో ప్రేమ నటించారు.