టిక్ టాక్ ఫేమ్ బంజారాహిల్స్ ప్రశాంత్ ట్రాన్స్ జెండర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె జోగినిగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతం అల్లాపూర్ కు చెందిన ట్రాన్స్ జెండర్ గౌరారం ప్రశాంతి తల్లిదండ్రుల సమక్షంలో మంగళవారం నాడు కత్తితో వివాహమాడి జోగినిగా మారింది. అయితే ఉప్పల్ బాలు.. బంజారాహిల్స్ ప్రశాంత్.
కాగజ్ నగర్ సాయి.. హైదరాబాద్ లైలా పారు.. లాంటివాళ్లకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. సోషల్ మీడియాలో వాళ్లపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగినా, చాలా మందికి వాళ్లంటే చిన్న చూపు ఉన్నా, మీమ్స్ క్రియేటర్లకు ఆ బ్యాచ్ ఎంతగానో ఉపయోగపడుతూనే ఉన్నారు. నిషేధం తర్వాత టిక్ టాక్ స్టార్లు కొందరు వేరే ప్లాట్ ఫామ్స్ లో పెర్మామెన్సులు చేస్తుండగా, ఇంకొందరు నిజంగానే జెండర్ మార్చేసుకున్నారు.