ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు.. వారసుడి కోసమే ఆ టాలీవుడ్ స్టార్ హీరో రెండో పెళ్లి.

ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26 న జన్మించాడు. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహా నగరానికి వచ్చింది. తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేక తన యవ్వనంలో బెంగుళూరుకు పారిపోయి వచ్చాడు. అయితే ప్రకాష్ రాజ్ కొడుకు ఐదేళ్ల వయసులో గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు.

అయితే వారసుడు దూరమైనప్పటికి అతని జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నానని చాలా సందర్భాల్లో ప్రకాష్ తెలిపారు. మర్చిపోలేక తన వ్యవసాయక్షేత్రంలోని సమాధి చేసినట్లుగా తెలిపాడు. కొడుకును దూరం చేసుకున్న తర్వాత తెలిసింది తాను ఎంత నిస్సహాయస్థితిలో ఉన్నానో అని చాలా మందితో చెప్పుకునేవాడు. కొడుకును పోగొట్టుకోవడంతో కుంగిపోయిన ప్రకాష్ రాజ్ ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించాడు.

కొడుకు మరణానంతరం ప్రకాష్ రాజ్, భార్య మధ్య సమస్యలు తలెత్తాయి. 2009లో వారిద్దరూ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికి తాను తన ఇద్దరు కూతుళ్లను అమితంగా ప్రేమిస్తున్నానని చెప్పారు. ఒక సంవత్సరం తర్వాత 2010లో ప్రకాష్ రాజ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నాడు. వారికి వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు.

మొదటి కొడుకు విడిపోయాక మరో కొడుకు కావాలనే ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే పోనివర్మ తనపట్ల చూపించిన ప్రేమను ప్రకాష్ రాజ్ చాలా సందర్భాల్లో చెప్పారు. నేను ఆమె శక్తిని ప్రేమిస్తున్నానని .. ఆమెను 45 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నాను.

అకస్మాత్తుగా మీరు యవ్వనంగా ఉన్నారని , చాలా ఆనందం నా జీవితంలోకి వచ్చిందన్నారు. తన కంటే 12 సంవత్సరాల చిన్న, పరిపక్వత కలిగిన ఒక మహిళ అంటూ పోనివర్మ గురించి చెప్పారు. తనను నమ్ముకొని ఇంటికి వచ్చిన ఆ అనుభూతి ఇంకా మర్చిపోలేనని ప్రకాష్ రాజ్ తన రెండో భార్య పోనీ వర్మ గురించి ఇంటర్వూలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *