ప్రగతి సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సీరియళ్లలో ఆమె ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. వెండితెర, బుల్లితెరపై రాణిస్తున్న ప్రగతి సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆమె దైనందిత జీవితాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రగతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు హీరోయిన్ ఛాన్స్ వచ్చినా ఎందుకు వదులుకున్నానో కూడా చెప్పింది.
ఈ మధ్యకాలంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై స్పందించినటువంటి ప్రగతి నా పర్సనల్ జీవితం గురించి ఎవరూ కూడా ఇలా మాట్లాడకూడదు ఇలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా వార్నింగ్ ఇచ్చింది. అయితే ప్రగతి హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చిందట. అయితే కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారి పోయాయట.

ఇక చివరికి ఇక ఏం చేయాలో తెలియక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెట్ అయిపోయిందట. అయితే హీరోయిన్ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో తన స్నేహితురాలు ఒకరు హీరోయిన్ అయితే కొన్నాళ్లపాటే ఇండస్ట్రీలో కొనసాగుతాం అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితే మన జీవితకాలం గట్టిగా ఉండవచ్చు అని చెప్పింది అంట. ఆమె మాటలకు ఆలోచించిన ప్రగతి చిన్న వయసులోనే తల్లి పాత్రలు చేయడం మొదలుపెట్టిందట. అయితే తాను చిన్నతనంలోనే తల్లినయ్యానని చెప్పుకొచ్చింది ప్రగతి.