తాను రెండో పెళ్లి చేసుకునే విషయం తనను కనుక్కోకుండా..ఎలాంటి ఆధారాలు లేకుండా పేపర్లో ప్రచురిస్తారంటూ ప్రముఖ వార్త పత్రిక సాక్షిని ఎండగట్టారు. చదువుకున్న వాళ్లు, విలువలు తెలిసిన వాళ్లు, సమాజానికి మంచి వార్తలు అందించే అలాంటి సంస్థ ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటని ధ్వజమెత్తారు ప్రగతి. అయితే గత కొంతకాలంగా సినిమాలలో తక్కువ కనిపిస్తున్న ప్రగతి ఈ మధ్యనే సీరియల్స్ లో కూడా నటించడం మొదలుపెట్టింది. ఇక సెలబ్రిటీలు అన్నాక సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ప్రగతి మీద కూడా ఒక రూమర్ వచ్చింది.
గత కొంత కాలంగా ప్రగతి .. ఒక నిర్మాతతో ప్రేమలో ఉందని, త్వరలోనే ఆ నిర్మాతను పెళ్లి చేసుకుంటుందని ఒక వెబ్ సైట్ రాసుకొచ్చింది. దాంతో ఇది నిజమేనా అని నెటిజన్లు.. ప్రగతిని అడగడంతో.. ఈ విషయం కాస్తా ప్రగతి వరకు వెళ్ళింది. ఆమె ఈ విషయాన్నీ ఖండించడంతో పాటు సదురు వెబ్ సైట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. “నేను ఆ వార్తను ఖండిస్తున్నాను. ఇలాంటి ఫేక్ న్యూస్ ను పప్రింట్ చేసినా ఆ వెబ్ సైట్ పై ఒకప్పుడు నాకు చాలా గౌరవం ఉండేది. అసలు అందులో నిజం ఎంత అనేది తెలియకుండా ఎలా రాస్తారు. ఒక సంస్థ ను నడుపుతున్నవాళ్ళు.. వాళ్లలో ఎంతంనుండి చదువుకున్నవారు ఉంటారు .. మంచి కుటుంబం నుంచి వచ్చినవారుంటారు.
ఒక మంచి కమ్యూనిటీ నుంచో ఒక వార్త పెడుతున్నారు అంటే.. అది ఎంత నిజం అయ్యి ఉండాలి. ఇలా బేస్ లెస్ గా .. నేనొక ఒక నటిని కాబట్టి.. ఎలాంటి ఆధారం లేకుండా ఫేక్ న్యూస్ ను ప్రింట్ చేసి.. వదిలేద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు. ఒకరి పర్సనల్ లైఫ్ లోకి వచ్చి.. ఇలాంటి వార్తలు రాయడానికి మీకేం హక్కు ఉంది.. ? ఒకవేళ ఆధారాలు ఉండి.. మీరు మాట్లాడితే పర్వాలేదు.. అసలేమీ లేకుండా.. ఎవడో కలగన్నాడా.. ? ఏదో అనుకున్నాడా.. ? అని రాసేశారు. ఈ వార్తను నేను ఖండిస్తున్నాను. ఇకనుంచి అయినా.. కొంత హోమ్ వర్క్ చేయండి.. ఏది నిజం .. ? ఏది అబద్దం ..? అని తెలుసుకొని రాస్తే బావుంటుంది.