సలార్ సినిమాతో పాటు KGF, బాహుబలి సినిమాల గురించి కూడా డిస్కషన్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రోమోలో పూర్తిగా చూపించకపోయినా హింట్ మాత్రం ఇచ్చారు. అయితే ప్రోమో చివర్లో ప్రభాస్.. అయితే కచ్చితంగా బాహుబలి 3 ఉంటుంది అని అన్నాడు.
దీంతో ప్రభాస్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రభాస్ కెరీర్ లో బాహుబలి ఎంత భారీ విజయం సాధించిందో తెలిసిందే. ప్రభాస్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. గతంలో కూడా దీనికి పార్ట్ 3 ఉండొచ్చు అని వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు ప్రభాస్ నోటి నుండి బాహుబలి 3 మాట రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
మరి దీనిపై క్లారిటీ రావాలనుంటే ఫుల్ ఉంటర్వ్యూ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఈ ఫుల్ ఇంటర్వ్యూ డిసెంబర్ 19న రిలీజ్ కానుంది.