బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ప్రభాస్ రాకపోవడానికి ప్రధాన కారణం అదే.

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు పూర్తయ్యింది. అనంతరం శ్రీరామ మందిరంలో శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించారు. అంగరంగ వైభవంగా జరిగిన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ దంపతులు కూడా ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమయ్యారు.

అయితే బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ ఈ అద్భుత ఘట్టం వీక్షించేందుకు హాజరయ్యారు. చిరంజీవి ఫ్యామితో పాటు మరికొంతమందికి కూడా ఆహ్వానం అందింది. వారిలో ప్రభాస్, ఎన్టీఆర్ కూడా ఉన్నారు. కానీ ప్రభాస్, ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

ఈ ఇద్దరూ తమ షూటింగ్స్ తో బిజీగా ఉండటంతో ప్రాణప్రతిష్ఠకు హాజరుకాలేదని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమాషూటింగ్ లో ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు హాజరుకాలేదని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *