ప్రభాస్ మోకాలికి సర్జరీ సక్సెస్, షూటింగ్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడో తెలుసా..?

తాజాగా ప్రభాస్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఆయన మోకాలి సర్జరీ కోసం యూరప్ వెళ్లినట్లు తెలుస్తోంది. సుమారు రెండు నెలల పాటు ఆయన అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత 6 నుంచి 7 వారాల పాటు రెస్ట్ తీసుకుంటారట. అంటే వచ్చే 4 నెలల పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉండనున్నారు. 2024లో సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘సలార్‘ షూటింగ్ కంప్లీట్ కాగా, ‘కల్కి 2898 AD’ షూటింగ్స్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

సర్జరీ తర్వాతే కొత్త సినిమాలను ప్రభాస్ టేకప్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే బాహుబలి సినిమాలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చేయడంతో.. ప్రభాస్ కు మోకాలిలో నొప్పి ఏర్పడింది. అయితే ఈ సమస్యకు తాత్కాలికంగా చికిత్స తీసుకున్న ప్రభాస్ ఆదిపురుష్, సలార్ మూవీలను కంప్లీట్ చేశాడు. తాజాగా ఈ నొప్పి మరింత తీవ్రం కావడంతో.. సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు డార్లింగ్. అందులో భాగంగానే.. యూరప్ వెళ్లాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రభాస్ కు మోకాలి సర్జరీ సక్సెస్ అయ్యిందని తెలుస్తోంది. అయితే దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ప్రభాస్ కు సూచించారు.

దీంతో నెల రోజుల తర్వాత అంటే నవంబర్ లో ప్రాజెక్ట్ కె, మారుతి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటాడు డార్లింగ్. అయితే సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సింది. కానీ వీఎఫ్ఎక్స్ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ఈ విభాగంపై మళ్లీ దృష్టి పెట్టింది మూవీ టీమ్. దీంతో సినిమా వాయిదా పడింది. ఈ గ్యాప్ లో మిగతా మూవీల షూటింగ్స్ కు కాస్త గ్యాప్ ఇచ్చి సర్జరీ కంప్లీట్ చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ మోకాలికి సర్జరీ సక్సెస్ కావడంతో.. అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *