ఈశ్వర్ అనే చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించి తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది. అయితే మొదటి సినిమాతోనే శ్రీదేవి తన అందంతో,నటనతో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
1992 రిక్షా మామ అనే తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది శ్రీదేవి. 2002 లో ప్రభాస్ కు జోడిగా ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈశ్వర్ సినిమాలో తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈశ్వర్ సినిమా విజయం తర్వాత తమిళ్ లోను,తెలుగులోనూ శ్రీదేవి కి అవకాశాలు క్యూ కట్టాయి.
అయితే తమిళ్ లో కంటే తెలుగులోనే శ్రీదేవి కి మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో ఈమె నిన్నే ఇష్టపడ్డాను,నిరీక్షణ,ఆదిలక్ష్మి,పెళ్లి కానీ ప్రసాద్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే రాహుల్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది శ్రీదేవి. ఈ దంపతులకు రూపిక అనే పాప ఉండి.
శ్రీదేవి చివరిసారిగా 2011 లో మాస్ మహారాజ్ రవితేజ కు జోడిగా వీర సినిమాలో కనిపించింది. పలు సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటిస్తుంది శ్రీదేవి. అలాగే డాన్స్ మరియు ఇతర రియాలిటీ షో లకు జడ్జి గా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం శ్రీదేవి కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.