ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న పూర్ణ ఇటీవలే అమ్మగా ప్రమోషన్ పొందింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో హమ్దాన్ అసిఫ్ అలీ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ పిల్లాడి ఆలనాపాలనతో బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. కాగా న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించింది పూర్ణ. ప్రతినాయకుడి భార్యగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమాయంలో తాను గర్భంతో ఉన్నానని,
షూట్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పూర్ణ తెలిపింది. అయితే ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ దసరా సినిమాలో తన పాత్రకు ఎక్కువగా రాత్రిపూట చిత్రీకరించే సన్నివేశాల్లే ఉన్నాయని ఆమె తెలిపారు.ఇలా రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల గర్భవతిగా ఉన్న తనకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.అంతేకాకుండా రెండు రోజులపాటు వర్షంలో తడుస్తూ చేయాల్సిన సన్నివేశాలు కూడా ఉండటంతో ఆ చల్లని నీళ్లు నాపై పడటం వల్ల నాకు మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టిందని ఆమె తెలిపారు.
అయితే నా సమస్యలను గుర్తించినటువంటి మేకర్స్ వేడి నీళ్లు పోస్తూ ఈ సినిమా షూటింగ్ చేశారని ఆమె తెలిపారు. ఇలా ఈ సినిమా షూటింగ్ సమయంలో అంత చలిలో పైగా రాత్రిపూట సినిమా షూట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డామని అలాగే రోడ్డుపై ఎవరూ లేకుండా ఒంటరిగా కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరిగెత్తే సన్నివేశం కూడా ఉంది ఆ సమయంలో కూడా తాను మరింత ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపారు. ఇలా రాత్రి సమయంలో ఎంతో కష్టపడి నటిస్తే కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారని పూర్ణ తెలియజేశారు.