2018లో తన భర్త బోనీ కపూర్ తో కలిసి దుబాయ్ లో జరిగే ఓ పెళ్ళికి వెళ్లిన శ్రీదేవి.. అక్కడ హోటల్ లోని బాత్ రూమ్ టబ్ లో పడి యాక్సిడెంటల్ గా మరణించింది. ఐదు పదుల వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా, అందంగా కనిపించే శ్రీదేవి.. ఎక్కడో విదేశాల్లో మరణించడం చాలామందిలో సందేహాలు రేకితించాయి. ఈక్రమంలోనే భర్త బోనీ కపూర్ పై అనుమానాలు వచ్చాయి. దుబాయ్ పోలీసులు కూడా బోనీ కపూర్ ని అదుపులోకి తీసుకోని విచారించడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది.
అయితే శ్రీదేవి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దీప్తి.. సామాజిక మాధ్యమాల్లో అనేక చర్చలు జరిపింది. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. శ్రీదేవి మరణంపై తాను సొంతంగా విచారణ జరిపినట్లు తెలిపింది. యూఏఈ, భారత్ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టాయని ఆరోపించింది. తన వాదనలకు బలం చేకూర్చేలా ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేఖలతోపాటు, సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్లను చూపించింది. దీంతో దీప్తిపై ముంబైకి చెందని న్యాయవాది చాందినీ షా.. సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె చూపిన పత్రాలన్నీ నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదులో దీప్తి లాయర్ భరత్ సురేశ్ కుమార్ పేరును కూడా చేర్చారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దీప్తి చూపిన ప్రధాని, రక్షణ మంత్రి లేఖలు నకిలీవని నిర్దారించారు. ఆమెపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. మరోవైపు సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయడంపై దీప్తి స్పందించారు. తన వాంగ్మూలం నమోదు చేయకుండా సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తనపై మోపిన అభియోగాలకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు అందజేస్తానని చెప్పారు.