జాతర జరిగిన రోజు అర్ధరాత్రి పోలేరమ్మ ఊరిలో తిరుగుతుందా..?

శివుని ఆరాధించే వారు శైవులు , విష్ణువును ఆరాధించేవారిని వైష్ణవులు , ఆదిశక్తి ని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు.శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత పొలిమేరమ్మ. అయితే ఊరి పొలిమేరలో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడే దేవి పోలేరమ్మ, మసూచి లాంటి రోగాల బారిన పడకుండా కాపాడ టానికి రోగం వచ్చిన తరవాత రోగనివారణకు అమ్మను పూజిస్తారు.

కొన్ని రోగాలకు అమ్మవారి పేరు పెట్టి ఇప్పటి వరకూ పురాతన పద్ధతుల ద్వారా రోగ నివారాణ చేసే ఆచారం దేశమంతా అనేక రూపాలలో కనిపిస్తుంది. ప్రతి ఊరికీ గ్రామానికి గ్రామదేవతలు ఉంటారు. ఇలా హిందూధర్మంలో శక్తి ఆరాధన అనేక రూపాలలో కనిపిస్తుంది. గ్రామదేవతలలో ఒకరు గ్రామశక్తి పోలేరమ్మ. ఇక పురాణానికి వస్తే, శ్రీమత్ కైలాస పర్వతం మీద ఈశ్వరుడు , పార్వతి ప్రధమ గణములతో కూర్చున్న సమయంలో పార్వతి శివునితో ఒక సంగతి అడుగుతుంది.

మహాత్మా తమరు సమస్త లోకములు పరిపాలించు కర్తలు , ఏకనిదానముతో ఉన్నా వారైనందున తమకు తెలియని అంశములు ఏమియు లేవు . కృత , త్రేతా, స్వపర , కలియుగములో చివరిదైన కలియుగములో స్త్రీలు మిక్కిలి పాపత్ములుగాను , సంతానలేమి వారుగాను కాగలరు అని భవిస్య వాని చెప్పుతున్నందున పుణ్యము నిచ్చే ఒక వ్రతమును చెప్పుమని కోరగా, ఈ పోలేరమ్మ వ్రతము ను చెప్పెనని అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *