హైపర్ ఆది బుల్లితెర స్టార్ కమెడియన్. జబర్దస్త్ వేదిక వెలుగులోకి వచ్చాడు. జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ సంచలనాలు చేసింది. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ వదిలేశాడు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ రియాలిటీ షోలో సందడి చేస్తున్నాడు. అలాగే సినిమాల్లో రాణిస్తున్నాడు. హైపర్ ఆదికి కమెడియన్ గా వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆది, మేడ మీద అబ్బాయి, సవ్యసాచి, మిస్టర్ మజ్ను ఇలా ఇరవైకి పైగా చిత్రాల్లో నటించాడు. నెక్స్ట్ ఆయన విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో కనిపించనున్నారు. తన మార్క్ కామెడీ తో అభిమానులను సొంతం చేసుకున్న హైపర్ ఆది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనపై ప్రచారంలో ఉన్న ఓ రూమర్ పై స్పందించాడు.
జోర్దార్ సుజాత హోస్ట్ గా డయల్ న్యూస్ ఛానల్ లో జోర్దార్ పార్టీ విత్ సుజాత పేరుతో టాక్ షో ప్రసారం అవుతుంది. ఈ షోకి హైపర్ ఆది గెస్ట్ గా వచ్చాడు. ఓ అమ్మాయిని అల్లరి చేసినందుకు నిన్ను ఒంగోలులో కొట్టారట కదా… అని అడిగింది. అదంతగా అబద్దం అని హైపర్ ఆది క్లారిటీ ఇచ్చారు.