ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించింది. మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా. అవును.. ఆంద్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవానికి అన్నా లెజ్నెవా కూడా అక్కడే ఉండి నిరంతరం తన ఫోన్‌లో ఫోటోలు దిగింది. తన భర్త ప్రమాణస్వీకారం చేస్తుండగా వీడియో తీసుకుంంది.
అయితే నలిగిపోయారు సార్.. చాలా నలిగిపోయారు.. ఎంత నలిగిపోయారంటే కట్టుకున్న భార్యల గురించే గుచ్చి గుచ్చి పొడుస్తుంటే తట్టుకోలేక నలిగిపోయారు. మూడు పెళ్లుళ్లు.. ముగ్గురు పెళ్లాలు అని కాకుల్లా పొడుస్తుంటే బాధనంతా బయటకు చెప్పుకోలేక ఇంకా ఇంకా నలిగిపోయారు. నాలుగుగోడల మధ్య జరిగిన గొడవల్ని బయటకు చెప్పుకోలేక.. ఆడదాని ఐదోతనానికి వెలకట్టలేక బాగా నలిగిపోయారు సార్.
మూడు రాజధానుల గురించి ప్రశ్నిస్తుంటే.. ముగ్గురు పెళ్లాలనే సమాధానం విని నలిగిపోయారు. ఆడాళ్లను ఎత్తుకెళ్లి మానభంగం చేస్తున్నారని ప్రశ్నిస్తే.. ఇంట్లో ఆడాళ్లని దూషించడం చూసి నలిగిపోయారు. సినిమావాడు.. చేతకాని వాడు అపహాస్యం చేస్తుంటే ఇంకా ఇంకా నలిగిపోయారు. రెండు చోట్లా ఓడిపోయాడని హేళన చేస్తుంటే ఇంకా ఇంకా నలిగిపోయారు. చివరికి మీ కట్టు బొట్టుని కూడా హేళన చేస్తుంటే ఇంకా ఇంకా నలిగిలిపోయారు.