బిగ్‌బాస్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్‌కేసు తీసుకున్నాడు. అది కూడా ప్రైజ్ మనీ 50 లక్షల నుంచే కట్ అవుతుంది. అంటే రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ స్వయంగా వెల్లడించాడు.
అయితే బిగ్ బాస్ అయిపోయి దాదాపు మూడున్నర నెలలు కావోస్తోంది. కానీ పల్లవి ప్రశాంత్ తాను ఇచ్చిన మాట ప్రకారం ఒక్క రూపాయి కూడా ఎవరికీ సాయం చేయకపోవడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రైతులకు సాయం చేస్తానని.. రైతు సింపథీతో విన్నర్ అయ్యి.. తీరా గెలిచిన తరువాత ఆ మాటే మర్చిపోయాడని ట్రోలింగ్ చేశారు. ఇక ప్రశాంత్.. తాను ఎంపీని అవుతా.. ఎమ్మెల్యేని అవుతా.. పాలిటిక్స్‌లోకి వస్తా అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి రేంజ్‌లో వీడియోలు పెడుతూ తెగ హడావిడి చేస్తుండగా..
అవన్నీ తరువాత కానీ.. ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకో అని పల్లవి ప్రశాంత్‌ని ఓ రేంజ్‌లో ఏకిపారేశారు నెటిజన్లు. దాంతో.. పల్లవి ప్రశాంత్ ఓ పేద కుటుంబానికి రూ.1 లక్ష సాయం చూస్తూ.. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పల్లవి ప్రశాంత్’ అని వీడియోలు పోస్ట్‌లతో హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. తన తొలి సాయం.. తన గురు.. బిగ్ బాస్ ఫైనలిస్ట్ శివాజీ చేతుల మీదుగా అందించి.. మాట నిలబెట్టుకున్నానంటూ పోస్ట్‌లు, వీడియోలతో మళ్లీ హడావిడి మొదలు పెట్టాడు పల్లవి ప్రశాంత్.