ఎస్తేరా నొరోన్హా..ఆమె కీలక పాత్ర పోషించిన షకీలా మూవీ ఇప్పటికే హిందీ, కన్నడ, తమిళ భాషల్లో రిలీజైంది. తెలుగులో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. షకీలా సినిమాలో భాగం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో షకీలాకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. నా క్యారెక్టర్‌కు అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. గతంలో ఇంద్రజిత్ లంకేష్‌తో సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో వర్కువుట్ కాలేదు. ఆ కారణంగా నాకు షకీలా ఫ్రెండ్ క్యారెక్టర్‌ను ఆఫర్ చేశారు అని ఎస్తేరా నొరొన్హా తెలిపారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తర్ నోయల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నానని, అందుకే అతడి నుంచి విడిపోవాలని డిసైడ్ అయిపోయానని ఎస్తర్ ఓపెన్ అయింది. అందుకే అంత త్వరగా విడాకులు తీసుకున్నానని ఎస్తర్ చెప్పుకొచ్చారు. విడాకుల తర్వాత నోయల్ తనపై చెడు ఇంపాక్ట్ పడేలా క్రియేట్ చేశాడని ఎస్తేర్ చెప్పింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనుకున్నా అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక నోయల్ క్రియేట్ చేసిన చెడు ప్రభావంతో తనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయని ఎస్తర్ చెప్పింది. అంతా నాదే తప్పు అనుకోని ఒక వ్యక్తి అయితే ఏకంగా హైదరాబాద్ వస్తే యాసిడ్ పోస్తామని హెచ్చరించాడని తెలిపింది. దీంతో ఈ విషయాలు జనాల్లో హాట్ ఇష్యూ అయ్యాయని అన్నారు. విడాకులు తీసుకునే సమయంలో కొందరు మేమున్నాము అని ధైర్యం ఇచ్చారని తెలిపింది. విడాకులు తీసుకుని మంచి పనే చేశానని, ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకువచ్చింది.