తన శరీర బరువు గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. తాను అధికంగా బరువు పెరగడానికి తానే కారణమంటూ తెలియజేశారు.. ఎందుకంటే ఒకసారి తనకు ఫుడ్ పాయిజన్ అయిందని దీంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యానని..ఆ సమయంలో తనకి భోజనం పెట్టకుండా సెలైన్ ఎక్కించే వారని తెలిపారు. అయితే ఈ మధ్యనే తనకు ఫుడ్ పాయిజన్ అయిందని.. హాస్పిటల్లో అడ్మిట్ అయి సెలైన్ కూడా ఎక్కించారట..అప్పుడు ఆసుపత్రిలో ఫుడ్ ఇచ్చేవారు అటు ఇంటి నుంచి ఆహారం కూడా వచ్చేది.
ఏది వేస్ట్ చేయకూడదని ఉద్దేశంతో చాలా తినేశానని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక రాత్రిపూట ఎక్కువగా భారీగా లాగిన్ చేయడంతో అలా తెలియకుండానే చాలా బరువు పెరిగిపోయాను అంటూ తెలియజేశారు రాజీవ్ కనకాల. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో క్రికెట్ ఆడడం జరిగింది వరంగల్లో ఆ సమయంలో తన కాలు బెణికిందని తెలిపారు. వీటికి తోడుగా లావు పెరగడంతో సరిగ్గా నడవలేక పోతున్నాను నేను తినేటప్పుడు ఎవరైనా చాలు ఆపేయమని చెబితే మాత్రం చాలా కోపం వస్తుంది అంటూ తెలిపారు రాజీవ్ కనకాల.

అందుకే తను తినేటప్పుడు వద్దని ఎవరూ చెప్పరంటూ కూడా తెలియజేశారు. ప్రస్తుతం తాను బరువు తగ్గడానికి పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాజీవ్ కనకాల తెలియజేస్తున్నారు.. రాజీవ్ – సుమ కొడుకు రోషన్ బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంతో పరవాలేదు అనిపించుకున్నారు. తన తదుపరిచిత్రాన్ని ఎవరి డైరెక్షన్లో పని చేస్తారో చూడాలి మరి.