ఐదు నెలలకే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిన్నారి ప్రతిభను ‘నోబెల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ’ గుర్తించి తమ రికార్డ్స్‌లో చోటు కల్పించి పతకాన్ని అందజేసింది. కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన ఇడుపులపాటి నితిన్, తనూజలు దంపతులు.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఐదు నెలల కుమార్తె జైత్రి..
పుట్టిన కొద్దిరోజులకే తనకున్న జ్ఞాపక శక్తి, గుర్తింపు, గ్రహించడంపై తల్లిదండ్రులు గమనించారు. అయితే ఇక ఆ చిన్నారికి మరికాస్తా ట్రైనింగ్ ఇస్తే.. అద్భుతం సాధిస్తుందని భావించారు. ఇక అప్పటి నుంచి జైత్రికి వివిధ రకాల మొక్కలు చూపిస్తూ వాటి వాడుక పేర్లను చెప్పడం మొదలు పెట్టారు. అంతేకాక వాటి శాస్త్రీయ నామాలను సైతం పాపకు చెప్పారు.
అలా ఆ చిన్నారి కొన్ని రోజులకు వంద రకాల మొక్కల్లో దేని పేరు చెప్పినా వెంటనే ఫ్లాష్ కార్డు ఆల్బమ్ లో వాటిని సులభంగా గుర్తిస్తోంది. ఇలా కొన్ని రోజుల పాటు తమ బిడ్డకు మొక్కల గురించి చెప్పడం ప్రారంభించారు. ఇదే సమయంలో జైత్రికా టాలెంట్ ను తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన ‘నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థ’ ఆ పాప ప్రతిభను పరీక్షించింది.