సెక్షన్ 4 ప్రకారం ప్రామిసరీ నోటు గురించి పూర్తిగా వివరాలు ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అప్పు తీసుకొని మళ్లీ మీ డబ్బులు నీకు చెల్లిస్తాను అనే దానికోసమే ఈ నోట్ అనేది సాక్ష్యం గా ఉంటుంది. ఇదే కాకుండా కొంత మంది అప్పు ఇచ్చేటప్పుడు చెక్ కూడా తీసుకుంటారు. అయితే డబ్బులను వడ్డీకి ఇచ్చే ముందు ప్రామిసరీ నోటును రాయించుకుంటారు. అసలు ప్రామిసరీ నోటు లీగల్ యేనా ఇది కోర్టులో పనిచేస్తుందా అనే అనుమానులు కూడా ఉంటాయి.
ప్రామిసరీ నోటు లీగల్ అంతే కాకుండా కోర్టులో చెల్లుబాటు అవుతుంది కూడా. ప్రామిసరీ నోటు రాయించుకున్న తరవాత మూడేళ్ల లోపు అసలు కానీ కట్టకపోతే మూడవ సంవత్సరం లోపు ఎంతో కొంత చెల్లించిట్టు సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సంతకం గనక తీసుకోకపోతే ఆ ప్రామిసరీ నోటు చెల్లుబాటు కాదు. మూడేళ్ల తరవాత ప్రామిసరీ నోటు పీరియడ్ పూర్తవుతుంది.
మీరు స్వయంగా వెళ్లి నోటు రాయించుకోలేకపోతే 30నెలల లోపు లాయర్ తో నోటీసు ఇప్పించాలి. అలా చేస్తే కాలదోషం నుండి తప్పించుకునే అవకాశం ఉంది. నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం అనేది చాలా విస్తారమైనది. ఇదిలా ఉండగా స్టాంప్ అంటించేటప్పుడు మరియు సంతకం తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.