టాలీవుడ్‌లో మరో విషాదం, చికిత్స పొందుతూ ప్రముఖ నిర్మాత మృతి.

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు యక్కలి రవీంద్ర బాబు. నిర్మాతగా ఈ ప్రయాణంలో 17కు పైగా సినిమాలు తీశారు. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రవీంద్ర బాబు ఎక్కువ సినిమాలు చేశారు. అయితే ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. శనివారం మధ్యాహ్నం మృతి చెందారు.

నిర్మాత యక్కలి రవీంద్ర బాబు శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో కలిసి ‘సొంత ఊరు, గంగపుత్రులు’ వంటి అవార్డు చిత్రాలతో పాటు.. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు పొందారు. మార్కాపురంలో పుట్టి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి.. ఛార్టర్డ్ ఇంజనీర్‌గా తన సేవలు అందిస్తూనే.. తనకి సినిమా పట్ల ఉన్న ఇష్టంతో నిర్మాతగా మారి దాదాపు 17 చిత్రాలను నిర్మించి పలు అవార్డులను పొందారు.

తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం భాషలలో కూడా నిర్మాత యక్కలి రవీంద్ర బాబు చిత్రాలను నిర్మించారు. ఆయనకు భార్య రమాదేవి.. ఒక కుమార్తె (ఆశ్రీత), కుమారుడు (సాయి ప్రభాస్) ఉన్నారు. నిర్మాతగానే కాకుండా గీత రచయితగా కూడా ఆయన తన ప్రతిభను చాటారు. ‘హనీ ట్రాప్, సంస్కార కాలనీ, మా నాన్న నక్సలైట్’ వంటి పలు చిత్రాలలో హృద్యమైన సాహిత్యం అందించిన సాహితి అభిలాషి అతను. యక్కలి రవీంద్ర బాబు మరణ వార్త తెలిసిన టాలీవుడ్.. ఆయనకు నివాళులు అర్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *