మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల.. యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించింది. ఇక పెద్దల సమక్షంలో చైతన్య జోన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. క్యూట్ కపుల్స్ లో వీరు ఒకరు పేరు తెచ్చుకున్నారు. ఏం జరిగిందో తెలియదు.. గత ఏడాది సైలెంటుగా విడాకులు తీసుకుని షాకిచ్చారు. ఇక మెగా ఫ్యాన్స్ కూడా చాలా కంగారుపడిపోయారు. వీరు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు.
అయితే తాజాగా చైతన్య సైలెన్స్.. సైలెన్స్ అంటూ ఓ పోస్ట్ షేర్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ పోస్ట్ లో.. ‘విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, నీటి అడుగున ఉన్న నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలలో మీరు కోరుకునే సైలేన్స్ .. ఇళా నిశ్శబ్దం అనేది మీ ప్రాణశక్తిని నుంచి వేరు చేస్తుంది. ఇదే మౌనం దేవుడితో కలిపే మాధ్యమం’ అంటూ ఫిలాసఫీకల్ గా చైతన్య రాసుకొచ్చాడు.
కాగా, ప్రస్తుతం చైతన్య జొన్నలగడ్డ షేర్ చేసిన ఈ పోస్ట్ అనేది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే అతను ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్ చేశాడో తెలియదు కానీ, నెటిజన్స్ మాత్రం ఏమైందన్నా.. ఎందుకు సైలెన్స్ అంటూ పోస్ట్ పెట్టావ్ , దైవ చింతనలో మునిగిపోయావా అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు చైతన్య పెట్టిన ఈ పోస్ట్ అనేది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి, చైతన్య ఆ రకంగా పోస్ట్ పెట్టడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.