నిహారిక చేసిన తప్పు వలన నాగబాబుకు కోట్లల్లో నష్టం, ఆ తప్పు ఏంటంటే..?

మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ హీరోయిన్గా అంతగా సక్సెస్ కాలేదు. దీంతో నిహారికకు జొన్నలగడ్డ చైతన్యను ఇచ్చి వివాహం చేశారు. కానీ వీళ్ళ పెళ్లి మూణ్ణాల ముచ్చట గానే సాగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏకంగా విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు.

అయితే ఇటీవల నిహారిక ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలని పంచుకుంది. అందులో ముఖ్యంగా చిన్నప్పుడు తనకి మంచి మంచి బంగారు వస్తువులు వేసేవారు అంట. అమ్మకి నేనంటే చాలా ముద్దు.. అందుకని కాస్ట్లీ బంగారం వస్తువులు వేసేది. కానీ ఆమె నా మెడలో ఎప్పుడు వేసినా కూడా నేను వాటిని ఎక్కడో దగ్గర పడేసి వచ్చేదాన్ని.

అప్పుడు నాకు బంగారం అంటే అంత విలువ అయిన వస్తువుని నాకు తెలియలేదు. అందుకే దాన్ని అంత జాగ్రత్తగా ఉంచుకునే దాన్ని కాదు. అప్పుడు నేను పోగొట్టిన బంగారం దాచి ఉంటే.. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు అని చెప్పుకొచ్చింది. అంటే నిహారిక చిన్నప్పుడు అజాగ్రత్తతో చేసిన తప్పుకి వలన నాగబాబు అంత నష్టపోయాడా అని నెటిజనులు అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *