భర్తతో విడాకులు తీసుకున్న ఐదు నెలలకే.. నిహారిక ప్రేమలేఖ. ఎవరికో తెలుసా..?

నిహారిక యాంకర్‌గా స్థిరపడడమే కాకుండా, టెలివిజన్‌లో అనేక OTT షోలను నిర్మించి, చలనచిత్ర నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు, ఆమె ఏకకాలంలో వెండితెర కోసం ఒక చిత్రంలో పని చేస్తోంది, నిర్మాతగా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుంది. తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది, దానిని ప్రేమ లేఖగా అభివర్ణించింది.

అయితే నిహారిక..సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, పోస్టులతో వైరల్ అవుతూ ఉన్నారు. ఆమె విడాకులు తీసుకున్న దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఏం చేసినా అది వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా, పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ సినిమాలను నిర్మించే పనిలో ఉన్నారు. అయితే తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

తనకు అత్యంత ఇష్టమైన వారిని, తన జీవితంలో ప్రేరణగా నిలిచిన వారికి సర్ప్రైజ్ ఇస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. వాళ్లతో గడిపిన క్షణాలు జీవితంలో మర్చిపోను అని చెప్పుకొచ్చారు. ఆ ఒక్క వీడియోలో అందరూ వచ్చేలా పోస్ట్ చేశారు. వీడియో తో పాటు లవ్ లెటర్ టు ఆల్ మై ఏంజెల్స్ అని క్యాప్షన్ పెట్టారు. అందులో లావణ్య, శ్రీజ, వితికా, మోనాల్, జ్యోతిరాయ్, నిహారిక తల్లి పలువురు ఉన్నారు. ఈ వీడియో చూసిన నటిజెన్లు లవ్ సింబల్ షేర్ చేస్తున్నారు. మరి కొందరు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *