విడాకుల తర్వాత తెగ సంబర పడుతున్న నిహారిక. ఎందుకో తెలుసా..?

నీహారిక కొణిదెల తెలుగు సినిమా నటి. ప్రముఖ నటుడు, నిర్మాత, టీవీ యాంకర్ అయిన నాగేంద్రబాబు కూతురు. నీహారిక నటి కంటే ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. అటు తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో కథానాయికగా నటించింది. జూన్ 2016లో విడుదలైన ఒక మనసు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా నటిగా తెరంగేట్రం చేసినది. అయితే గత కొన్ని నెలలుగా గ్లామరస్ ఫోటో షూట్స్ పరంపర కొనసాగిస్తోంది నిహారిక.

కిరాక్ పోజులతో రచ్చ చేస్తోంది. డివోర్స్ తర్వాత తన లైఫ్ తన ఇష్టం అన్నట్లుగా ముందుకెళ్తోంది మెగా డాటర్. దీంతో అమ్మడి ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా తన సంతోషం అందరికీ తెలిసేలా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది నిహారిక. క్రిస్మస్ పండగ సందర్భంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో దిగిన కొన్ని పిక్స్ పంచుకుంది. ఈ ఫొటోల్లో నిహారిక తెగ సంబర పడుతూ కనిపిస్తోంది. విడాకుల తర్వాత అచ్చం సమంత లాగే తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టేసింది నిహారిక.

పలు వెబ్ సిరీసులు చేస్తూ నిర్మాతగా కూడా రాణించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మళ్ళీ హీరోయిన్ గా తెరపైకి రావాలని ఫిక్సయిందట నిహారిక. మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తోంది నిహారిక. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ షురూ చేసి సినిమా నిర్మాణాలు చేస్తోంది. బ్యానర్‌పై ఇప్పటి వరకు లఘుచిత్రాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించిన నిహారిక.. ఇప్పుడు థియేటర్లలో విడుదల చేసే ఫీచర్ ఫిలింస్ నిర్మాణంలోకి ఎంట్రీ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *