నిహారిక త్వరలో ఓ మంచి సినిమాతో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల ఓ వార్త సోషల్ మీడిాయాలో వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో నిహారిక ఓ కీలక నిర్ణయం తీసుకుందట. ఇక హీరోయిన్‌గా ఆమె నటించదట.
కేవలం మంచి పాత్రల్లో నటించాలనీ ఉందట. ఇదే విషయాన్ని ఆమె తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. నిహారిక సినిమా ల్లో ఈసారి ఫుల్ స్వింగ్ తో కమర్షియల్ పాత్ర తో అందాల ఆరబోత చేసే విధంగా నటించబోతుంది అంటూ అంతా అనుకున్నారు. మెగా వర్గాల్లో తీవ్రంగా చర్చ జరిగింది. అయితే ఆ విషయమై ఇప్పటి వరకు నిహారిక నుంచి కానీ ఆమె సన్నిహితుల నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు. తెలుగు లో నిహారిక కి పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు.
కానీ ఆమె కు తమిళ్ లో ప్రయత్నిస్తే వరుస ఆఫర్లు వస్తాయి. ఇప్పటికే తమిళ్ లో నిహారిక నటించింది. అందుకే అక్కడ ప్రయత్నిస్తే బాగుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో హాట్ ఫోటో లను షేర్ చేస్తూ హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా నిలుస్తోంది.