నిహారిక కాస్త టైం తీసుకొనే కొంచెం ఇంట్రెస్టింగ్ సినిమాలే చేస్తోంది. అందులో భాగంగా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడాలో చేస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేయగా ఇప్పుడు ఆర్ డి ఎక్స్ నటుడు షేన్ నిగమ్‌తో ఓ తమిళ సినిమాలో నటిస్తోంది.
అయితే మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇటీవల తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా నిర్మాతగా మారి వెబ్‌సిరీస్‌లు, సినిమాలు తెరకెక్కిస్తూనే హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం నిహారిక పూర్తిగా ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.