ఎప్పుడూ నవ్వించే నెల్లూరు నీరజ తొలిసారి కన్నీరు, చాలా అవమానించారు అంటూ..!

బుల్లితెర, డిజిటల్ రంగంలో పై కూడా కొంత మంది తమ పంచ్ డైలాగులతో నవ్వులు, పువ్వులు పూయిస్తున్నారు. అందులో నెల్లూరి నీరజ ఒకరు. ఎప్పటి నుండో ఆమె ఇండస్ట్రీలోనే ఉన్నారు. ప్రముఖ కామెడీ యూట్యూబర్ ప్రసాద్ బెహరా వెబ్ సిరీస్ చూసే వాళ్లకు ఆమె సుపరిచితమే. ప్రసాదూ అంటూ తనదైన మాట తీరుతో నవ్విస్తూ ఉంటుంది ఈమె. తాజాగా నెల్లూరు నీరజ షేర్ చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ..

నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 సంవత్సరాలు అయ్యింది. ఈ 13 ఏళ్లల్లో మాగ్జిమమ్ అన్ని షోలు చేశాను. చాలా కామెడీ పాత్రల్లో నటించా.. టీవీ షోలు, వెబ్ సిరీస్ లు , సీరియల్స్ లోనూ నటించా.. కానీ సినిమాల్లో ఛాన్స్ మాత్రం అందుకోలేకపోయాను. సినిమాల్లో కనిపించకుండానే చనిపోతానని అనుకున్నా కానీ నాకల నెరవేరింది అని తెలిపారు. చిన్న చిన్న సినిమాల్లో నటించాను కానీ అవి అంతగా చెప్పుకోదగ్గవి కాదు. దాంతో ఓ చిన్న వెలితి ఉండిపోయింది. కానీ ఇప్పుడు సిద్దు హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్‌లో ఆయనకు మేనత్తగా చేశాను.

ట్రైలర్ లో నన్ను నేను చూసుకుంటే నా 13ఏళ్ల కష్టం ఇట్టే పోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నెల్లూరు నీరజ. చాలా అవమానాలు పడ్డాను, చాలా మంది నను ఎగతాళి చేశారు. నా పనైపోయింది అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు నేను సిద్దూ సినిమాలో నటించా.. నాకు ఛాన్స్ ఇచ్చిన సిద్దూ కి చాలా థ్యాంక్స్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నెల్లూరు నీరజ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *