బిగ్‌బాస్ నయని పావని రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలుసా..?

బిగ్‏బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా ఐదు వారాలు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆరోవారం ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. అయితే ఈ వారం శోభా శెట్టి బయటకు వెళ్తుందని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో పలు పోలింగ్స్ లోనూ అతి తక్కువ ఓటింగ్ వచ్చింది కూడా ఆమెకే.

ఇక బిగ్‏బాస్ ప్రోమోస్ కు శోభాను ఎలిమినేట్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే ఆమె హౌస్ నుంచి బయటకు రావాలని జనాలు ఎంతగా కోరుకుంటున్నారో తెలుస్తోంది. అయితే వీళ్లలో చాలామంది శోభాశెట్టి లేదా పూజామూర్తి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ వీళ్లిద్దరూ కాకుండా నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. అయితే గేమ్, టాస్కుల పరంగా ఈమెకి బలం ఉంది. ఇంకో రెండు-మూడు వారాలు ఉండుంటే రేసులో ఉండేదేమో.

కానీ పరిస్థితులు అనుకూలించక.. వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఇకపోతే వారానికి రూ.2 లక్షలకు నయని పావని అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే వచ్చిన వారం మాత్రమే ఉంది కాబట్టి కేవలం రూ.2 లక్షలు తీసుకునే ఇంటికి వెళ్లిపోనుంది. సో అదన్నమాట విషయం. మరోవైపు ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసిన శుభశ్రీ.. హౌసులో ఉన్నవాళ్ళ ఓట్లు వేయడంతో.. బిగ్‌బాస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. అంటే ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఇంకొకరు రీఎంట్రీ ఇచ్చారనమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *