అతను ఆమె సహోద్యోగి నర్సు భర్త అని తెలుస్తోంది. ఆమె స్నానం చేస్తుండగా నిందితుడు అతని మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడని నర్సు తెలిపింది. ఈ ఘటన అక్టోబర్ 10న ఉదయం 7 గంటల ప్రాంతంలో వాష్‌రూమ్‌లో స్నానం చేసేందుకు వెళ్లిన క్రమంలో జరిగిందని నర్సు ఆరోపించింది. అయితే అసాంఘిక కార్యకలాపాలకు, అకృత్యాలకు పాల్పడేవారిని అడ్డుకోవాల్సింది పోయి అతడే అలాంటి పనికి పాల్పడ్డాడు.. పైగా ఆయన ఓ పోలీస్. స్నానం చేస్తుండగా తన వీడియో తీసినట్టు ఓ నర్సు ఆరోపించింది.
ఆ వ్యక్తి తన సహోద్యోగి భర్తేనని తెలిపింది. ఈ ఘటన అక్టోబర్ 10న జరిగింది. బాధితురాలు మొరాదాబాద్‌లోని జిల్లా ఆసుపత్రిలో నర్సుగా చేస్తోంది. నిందితుడు తన పొరుగింట్లో ఉంటాడని, అతడు తన సహోద్యోగి భర్తే అని ఆమె చెప్పింది. ఆ రోజు ఉదయం తాను బాత్ రూం నుంచి పైకి చూడగా ఓ కెమెరా కనిపించిందని చెప్పింది. వెంటనే తాను బాత్రూమ్ బయటకు రావడానికి ప్రయత్నించగా బయట లాక్ చేసి ఉందని తెలిపింది. దాంతో మరో మహిళను డోర్ తెరవమని కోరగా ఆమె వచ్చి గొళ్లెం తీసింది.
వెంటనే తన సహోద్యోగి ఇంటికి వెళ్లి తలుపు తెరవమని కోరింది. అక్కడ తనతోపాటు పనిచేసే స్టాఫ్ నర్స్ భర్త పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు. ఆ క్రమంలో కానిస్టేబుల్‌ను మొబైల్ ఫోన్ చూపించాలని ఆమె కోరగా..కానిస్టేబుల్ నిరాకరించి నర్సును తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేసింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుడి మొబైల్‌ను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిందితుడు మొరాదాబాద్‌లోని జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు అంజలీ దేవి భర్త అని తేలింది. కానిస్టేబుల్ వద్ద నుంచి ఫోన్ లాక్కుంటుండగా వీడియో డిలీట్ చేశారని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. విచారణలో ఆరోపణలు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
उत्तर प्रदेश के मुरादाबाद जिला अस्पताल की स्टाफ नर्स ने साथ काम करने वाली स्टाफ़ नर्स के पुलिसकर्मी पति पर MMS बनाने का आरोप लगाया है। नर्स का आरोप है कि पुलिसकर्मी ने नहाते समय उसका वीडियो बनाया। फ़िलहाल आरोपी पुलिसकर्मी को निलंबित कर दिया गया है। pic.twitter.com/kQIozmoQD6
— Bhadohi Wallah (@Mithileshdhar) October 11, 2023