సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా సంఘాల మహిళలను కలిశానని, నియోజకవర్గ ప్రజల కోసం లోకేష్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పానన్నారు.
వాటిలో స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు 32 బ్యాచ్ లుగా 1600 మందికి కుట్టు శిక్షణ ఇచ్చి… కుట్టు మిషన్లు కూడా అందజేశారని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి లోకేష్ ఎంతో దోహదం చేస్తారని, తన ప్రతి విజయం వెనుక లోకేష్ ఉన్నారని బ్రాహ్మణి తెలిపారు. అంతకుముందు మల్లె తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలతో బ్రాహ్మణి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వారంతా బ్రాహ్మణితో మాట్లాడుతూ లోకేష్ కు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. రాజధాని భూములు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే చంద్రబాబు ముఖం చూసి ఇచ్చామని చెప్పారు.