స్టార్ మా ఛానెల్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ‘బ్రహ్మముడి’ సిరియల్ కోసం అందరికి తెలిసిందే. సాయంత్రం 7 అయిదంటే చాలు ప్రతిఒక్కరు ఈ సీరియల్ ప్రేమికులే. అంతలా ఈ సిరియల్ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ సీరియల్ లో కనకం ముగ్గురు కూతుళ్లలో మగరాయుడిగా అలరించే అప్పు క్యారెక్టరైజేషన్ మాత్రం భలే గమ్మత్తుగా ఉంటుంది. అమ్మాయి అంటే ఎంతో అణకువుగా లొంగి, వొంగి ఉండాలి.
కానీ, అప్పు మాత్రం ఆ మాటలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అలానే ఫ్యాంటూ షర్ట్ వేసుకొని మగరాయుడిలా ఉంటుంది. మరి, సీరియల్ లో అంతా డేరింగ్ అండ్ డాషింగ్ పాత్ర పోషిస్తున్న ఈ నటి పేరు ‘నైనిషా రాయ్’. ఈమె బెంగాలీ కి చెందిన అమ్మాయి. చిన్నతనం నుంచే సినిమాలపై ఉన్న ఆసక్తితో బెంగాలీ మూవీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకొని బెంగాలీ సినిమాల్లో నటించింది. అనంతరం.. తెలుగులో కూడా పలు సీరియల్స్ లో నటించింది.
అయితే, రీయల్ లైఫ్ లో ఈ అమ్మాడు ఎన్ని కష్టాలు పడిందో.. రియల్ లైఫ్ లో కూడా అన్నే కష్టాలు పడింది. బెంగాలీ కుటుంబానికి చెందిన నైనిషా రాయ్ తండ్రి ఒక లెక్చలర్ కాగా.. తల్లి హౌస్ వైఫ్. అయితే.. నైనిషా ఇండస్ట్రీకి రావడం.. పేరెంట్స్ కి ఇష్టం లేకపోవడంతో కూతురితో బంధం తెంచుకున్నారు. దీంతో నైనిషా తన పేరెంట్స్ గురించి మాట్లాడుతూ.. ‘వాళ్ల ఆలోచనలో వాళ్లు కరెక్టేమో కానీ.. నాకు మాత్రం వాళ్లు చేసింది తప్పు’ అని చెప్పింది.