48 ఏళ్ల వయసులో పెళ్లి కావాలన్న నగ్మా, నాలో ఆ కోరిక ఉంది.

హీరోయిన్ గా రిటైర్ అయిన నగ్మా అత్త పాత్రలు చేయడం విశేషం. అల్లరి రాముడు మూవీలో ఎన్టీఆర్(NTR) అత్తగా ఆమె నటించారు. 2002 తర్వాత ఆమె తెలుగులో మూవీ చేయలేదు. 2008 నుండి పూర్తిగా నటనకు దూరమైంది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నగ్మా 2004లో కాంగ్రెస్ లో చేరారు. 2015లో నగ్మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎంపికైంది. అయితే ఈ ముద్దుగుమ్మ.. పెద్దింటి అల్లుడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అనతి కాలంలోనే దర్శక నిర్మాతలు తన ఇంటి ముందు క్యూ కట్టేలా చేసుకున్న ఈమె నచ్చిన కథలను ఎంచుకుంటూ ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.

తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్పురి , పంజాబీ, మరాఠీ, బెంగాలీ వంటి భాషలలో స్టార్ హీరోయిన్ గా, అగ్రగామిగా కొనసాగింది. ఇక ఈమె హీరోయిన్ గా చేసిన తర్వాత అత్త, తల్లి పాత్రలలో కూడా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడేమో తెలుగు తెరకు దూరమై దాదాపు 20 సంవత్సరాలు అవుతోంది. 2008లో నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించిన నగ్మా వయసు 48 యేళ్లు. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ఎంతో మందితో ప్రేమాయణం కొనసాగించిన ఈమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

ఇక తాజాగా తన పెళ్లి గురించి స్పందిస్తూ.. పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదు ..చెప్పాలంటే నాకంటూ ఒక తోడు ఉండాలి.. పిల్లలు కావాలన్నా ఆశ.. పెళ్లి ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉండేది. కాలం కలిసి వస్తే త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో చూద్దాం.. నిజంగా నాకు పెళ్లయితే మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. జీవితంలో సంతోషం అనేది కొంతకాలానికే పరిమితం కాదు కదా .. కాలం కలిసి వస్తే నేను కూడా పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యింది నగ్మా . మరి త్వరలోనే ఆమె అనుకున్న జీవితాన్ని పొందుతుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *