కీళ్ల నొప్పులు అందరినీ బాధిస్తున్నాయి. వివిధ రకాల మందులను వాడుతున్నప్పటికీ కీళ్ల నొప్పులు అదుపులోకి రావడం లేదని కొందరు బాధపడుతుంటారు. అలాంటి వారు మందులతో పాటు ఓ చిట్కా పాటిస్తే దాదాపు 50 శాతం మేర నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. వైద్య నిపుణులు సూచించే ఆ చిట్కా ఏంటో తెలుసా? బరువు తగ్గడం.
నిజమే బరువు తగ్గితే కీళ్ల నొప్పుల సమస్యలు దాదాపు 50 శాతం మేరక తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు శరీర బరువులో 10 శాతం తగ్గినా గణనీయమైన ఫలితాలను పొందవచ్చని పేర్కొంటున్నారు. బరువు తగ్గడం వల్ల కీళ్ల నొప్పులతో పాటు శరీరంలో చెడు కొవ్వు సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని చెబుతున్నారు.
నడక, యోగా, చిన్నపాటి వ్యాయామాల ద్వారా బరువు తగ్గవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆర్థరైటిస్ సమస్య ఉన్న వారు గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన శరీర నిర్వహణ కచ్చితంగా బరువ సమస్యపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.