ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోకూడదని కోరుకుంటాడు. అయితే కష్టపడి పనిచేసినా.. డబ్బు నిలవదు. అయితే శాస్త్రాలు ఏమంటున్నాయంటే.. శ్రమతో పాటు అదృష్టం కూడా ఉండాలని అంటున్నాయి. మరి అదృష్టం ఉండాలంటే.. రోజూ ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం దక్కుతుంది అంటున్నారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ అనుగ్రహం లేకపోతే ప్రపంచంలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము అనేటటువంటి మాట చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు.
ఆడవారు ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక పది నిమిషాలు సమయాన్ని కేటాయించి చక్కగా బ్రష్ చేసుకుని ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని చక్కగా తల దువ్వుకుని కారు బయట ఒక రెండు చెంబుల నీళ్లు చల్లి దాని పైన బియ్యప్పిండితో ముగ్గు వేయండి. ఈ బియ్యప్పిండిని చీమలు తింటాయి. అలా తినడంతో మీకున్న అప్పుల బాధలు తగ్గిపోతాయి. వారి వెంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఏర్పరచుకుంటుంది. అలా ముగ్గు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏదైనా లక్ష్మీదేవితో పాటు ఎప్పుడైతే పోయ్యి ని గౌరవిస్తామో శుభ్రంగా పెట్టుకుంటామో అప్పుడు లక్ష్మీదేవి మరింత స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది.
అలాగే తులసి మొక్కకి నీళ్లను పోయాలి. ఒక్కసారి మీరు ఉదయం నీళ్లు పోసేటప్పుడు మొక్కని విదిలిస్తే ఉన్నటువంటి ఆకులు రాలిపోయి చక్కగా ఫ్రెష్ గా కనబడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ముఖం కడుక్కున్న తర్వాత మాత్రమే నీళ్లు చిమ్మి వాకిట్లో ముగ్గు వేయండి. ఉదయం లేవగానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం ప్రతిరోజు ఈ మూడు పనులు చేయాలి. అలాగే అవి చేయటం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. మన జీవితంలో మార్పులు కలుగుతాయి.