కీళ్లు బలహీనంగా మారడం వల్ల మోకాలు లోపలి కణజాలం దెబ్బతింటుందని, దీని వల్ల లోపల మృదులాస్థి అరిగిపోవడం జరుగుతుందని, అటువంటి సమయంలో ఎటువంటి మూమెంట్ ఇచ్చినా తీవ్రమైన నొప్పి, మంట కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మోకాలు నొప్పి రావడానికి విపరీతంగా బరువు ఉండటం, సరైన వ్యాయామం శరీరానికి లేకపోవడం, శరీరానికి కావాల్సిన విటమిన్ డి3 లేకపోవడం వంటివి కూడా కారణాలుగా ఉంటాయని చెబుతున్నారు.
మోకాలు నొప్పి బాధను భరించలేక చాలామంది మోకాలు శస్త్రచికిత్సల బాట పడుతున్నారు. అయితే మోకాలు నొప్పి తగ్గించుకోవడానికి సరైన ప్రయత్నం చేయకుండా, ఆపరేషన్లు చేయించుకోవడం మంచిది కాదని కూడా వైద్యులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ముఖ్యంగా మోకాళ్లకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు.
ఉదయం సూర్యరశ్మి మోకాలిపై పడేలాగా చూసుకోవడం, వైద్యులు సూచించిన కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం చేస్తే శస్త్రచికిత్స అవసరం లేకుండా మోకాలి నొప్పులు తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. సరైన పోషకాహారం తీసుకోవడం, బరువు తగ్గడం పై శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడం, చాలావరకు ఉపశమనాన్ని ఇస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. మోకాలి చుట్టూ ఉండే కండరాలు బలపడితే మోకాళ్ళ పై కొంతమేర ఒత్తిడి తగ్గి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.
మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఉన్నవారు మెట్లెక్కడం, ఏటవాలుగా ఉన్న ప్రదేశాలలో నడవడం వంటివి చేయకూడదని ఏరోబిక్స్, జుంబా వంటివి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. మోకాళ్ళు వంచి చేసే వ్యాయామాలు కూడా చేయకూడదని సూచిస్తున్నారు.