అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..! ఇక నుంచి ఈ ఒక్క సర్టిఫికెట్‌ ఒక్కటి చాలు.

ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు, విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు పాస్‌పోర్ట్‌, వివాహాల నమోదుకు ఇకపై బర్త్‌ సర్టిఫికెట్‌ ఒక్కటే అందిస్తే సరిపోతుంది. ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అయితే కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టం ప్రకారం.. వచ్చే నెల అనగా, అక్టోబరు 1 నుంచి ఈ చట్టం అమలు కానుంది. జనన మరణాలు నమోదు చట్టం – 2023 బిల్లును గత వర్షకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది.

జనన, మరణాల నమోదు చట్టం – 2023 లోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చే రైట్స్ ను ఉపయోగించి.. కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేయనుంది. అందుకు సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి జన్మించే వారికి తప్పనిసరిగా జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేయనున్నారు. వ్యక్తి పుట్టినతేదీ, పుట్టిన ప్రదేశాన్ని సూచించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుతంతో పాటు రాష్టంలో ఇతర సేవలను వినియోగించుకునేందుకు ఈ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది.

ఉద్యోగ నియామకాల కోసం బర్త్ సర్టిఫికేట్ ను సింగిల్ డాక్యుమెంట్ లా వినియోగించుకోవచ్చు. జనన మరణాల నమోదు చట్టం – 2023 ప్రకారం.. దేశవాప్తంగా ఉన్న పౌరుల డేటాను నియంత్రించేందుకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం కలదు. ఇందులోని చీఫ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రార్లు.. జనన, మరణ డేటాను జాతీయ డేటాబేస్ లో షేర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఇందుకు సంబంధించిన ప్రతి రాష్ట్రంలో తమ తమ పౌరుల డేటాబేస్ ను నిర్వహించాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *