ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది భారత రాష్ట్ర సమితి. గత రెండేళ్లుగా ఢిల్లీ లిక్కర్ కేసు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ, ఈడీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి.
ఓవైపు నిందితులు అఫ్రూవర్లుగా మారుతుండగా.. కీలక సమాచారాన్ని రాబడుతున్నాయి దర్యాప్తు సంస్థలు. ఆ సమాచారంతోనే స్పీడ్ ను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే…. ఈ కేసులో పాత్రదారిగా చెబుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.
దీంతో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు అయింది. శుక్రవారం హైదరాబాద్ నుంచి చేరుకున్న ఈడీ బృందం… సాయంత్రం అరెస్ట్ చేసి రాత్రి సమయానికి ఢిల్లీకి తరలించింది.