రెండో పెళ్లి గురించి తన మనసులోని మాట చెప్పిన మీనా.

ఇటీవల మీనా భర్త అకస్మాత్తుగా చనిపోయిన విషయం తెలిసిందే. భర్త మరణం తర్వాత మీనా రెండో పెళ్లిపై అనేక రూపర్స్, వార్తలు వచ్చాయి. మీనా రెండో పెళ్లి చేసుకోనుందని తెగ ప్రచారం కూడా జరిగింది. అయితే అందంగా ఉన్నారు.. వయసు కూడా తక్కువే ఉంది. రెండో పెళ్లి చేసుకుంటారా ?.. అని పదే పదే అదే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగాడు ఓ జర్నలిస్ట్. దీంతో మీనా సూటిగా.. సుత్తిలేకుండా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. “మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇప్పుడైతే లేదు.

ఎవర్నీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతావా ? అంటే అలా చాలా మంది ఉంటున్నారు కదా. అలాగే నేను వాళ్లలాగే ఉంటానని కాదు.. ఎవరి పరిస్థితి వాళ్లది. నా జీవితం గురించి నేనెప్పుడు ముందే అనుకోలేదు. తక్కువ వయసు, ఎక్కువ వయసు అని కాదు.. నా భవిష్యతు గురించి నేను ఊహించలేను. నేను కాదు ఎవరూ ఊహించలేరు. ముందు నా జీవితం గురించి కాకుండా కూతురి గురించి ఆలోచిస్తున్నాను. సినిమాల్లోకి వస్తానని.. ఇంత పెద్ద హీరోయిన్ అవుతానని అనుకోలేదు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో నటిస్తానని ఊహించలేదు. జీవితం ఇలాగే ఉంటుందని కూడా అనుకోను.

పెళ్లి కూడా అంతే.. అప్పుడు.. ఇప్పుడు అని చెప్పలేను. అలాగని ఒంటరిగా ఉండిపోతానని చెప్పలేను. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నా కూతురి గురించి మాత్రమే. నాకంటే నా కూతురు నాకు ముఖ్యం. నా సుఖం, నా సంతోషం మాత్రమే కాదు.. నా ఫస్ట్ ప్రియారిటీ నా కూతురు. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వెయిట్ చేయడమే. పెళ్లి గురించి ఏమి ఊహించి చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చింది మీనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *