ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మీనాను ఆహ్వానించారు.
ఈ వేడుకకు ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బీజేపీ నేతలతో మీనా కనిపించడంతో ఆమె పార్టీలో చేరబోతున్నారనే వార్త వినిపిస్తోంది. అయితే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్లడం సాధారణ విషయమే.
ఇప్పటికే ఎందరో నటీనటులు వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారు. తాజాగా ప్రముఖ నటి మీనా గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. ఆమె త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనేదే ఆ వార్త. కేంద్రమంత్రి ఎల్. మురుగన్ ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు మీనాను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు.
ఈ వేడుకలో మీనాకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారట. తమిళనాడు నుంచి వెళ్లిన వారిలో మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె బీజేపీలో చేరబోతున్నారని… అందుకే ఆమెకు అంతటి ప్రాధాన్యతను ఇచ్చారని చెపుతున్నారు. మీనా కూడా బీజేపీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం.