పవర్‌ఫుల్ డైలాగ్‌లు, పంచులతో ప్రసంగాలు చేస్తూ.. సినిమా హీరోలకు మించి క్రేజ్ సంపాదించుకున్నారు మల్లారెడ్డి. ఇక ఆయన కోడలు ప్రీతి రెడ్డి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. అయితే మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ ఛైర్మన్‌గా వైద్య విద్యారంగంలో అందరికీ మంచి ఆరోగ్యం అందించడంలో తనదైన ముద్రను వేసుకుంటున్నారు డాక్టర్ సీచ్ ప్రీతి రెడ్డి.
అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్‌గా అందరికీ ముఖ్యంగా మహిళలకు ఉన్నత విద్యను అందించడంలో సహాయపడుతున్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీలో 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు అదేవిధంగా మల్లారెడ్డి మహిళా కాలేజీ ఉన్నాయి. ప్రత్యేకంగా.. ప్రతి మెడికల్ కాలేజ్ నుంచి 200 ఎంబీబీఎస్ సీట్లు ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే కేటాయిస్తుండటం విశేషం.
అత్యున్నత వైద్య సదుపాయాలతో మంచి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ప్రీతి రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ తెలంగాణలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీగా పేరుగాంచింది.