జగన్ బద్ధ శత్రువు కూతురితో షర్మిల కొడుకు పెళ్లి. షాక్ లో జగన్.

చాలా కాలం నుంచి అమెరికాలో ఉంటున్న ప్రియకు అక్కడి పౌరసత్వం కూడా ఉందట. ప్రస్తుతం ఆమె అక్కడే సెటిల్‌ అయ్యారు. పెళ్లి తరువాత షర్మిల కొడుకు కూడా అక్కడే సెటిల్‌ అయ్యే చాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటి అంటే.. ప్రియ కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఏపీలో రాజకీయంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు బద్ధ శతృవులు. ఈ పోరు కొన్నేళ్ల నుంచీ కొనసాగుతోంది. ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది.

అలాంటిది ఇప్పుడు ఏకంగా షర్మిల ఇంట్లోకే కమ్మ సామాజికవర్గానికి చెందిన అమ్మాయి కోడలుగా రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వీళ్ల పెళ్లితో రాజకీయ మార్పులు కూడా వచ్చే అవకాశముంది. అయితే వైఎస్‌ షర్మిల తనయుడు రాజారెడ్డి.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయితో కలిసి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో రెడ్డి, కమ్మ వర్గాల మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆ రెండు వర్గాల రాజకీయాలు నాటి నుంచి నేటి వరకూ కాకరేపుతుంటాయి.

రెడ్డి వర్సెస్‌ కమ్మ పాలిటిక్స్‌ నేపథ్యంలోనే ఇప్పటి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వైఎస్‌ షర్మిల తనయుడి పెళ్లి పొలిటికల్‌గా చర్చకు దారి తీస్తుందని వార్తలొస్తున్నాయి. USAలో చదువుకుంటున్న షర్మిల తనయుడు రాజారెడ్డి నాలుగేళ్లుగా అట్లూరి ప్రియతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల వీరి ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు చెప్తున్నారు. త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు సమాచారం. అయితే.. వీరిద్దరి వివాహం ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపుతుందా అని ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *